calender_icon.png 20 October, 2024 | 11:06 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

20-10-2024 01:39:28 AM

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 19: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఖానా సర్వే నంబర్ 26లో ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు రెవె న్యూ అధికారులకు సమాచారం అం దడంతో, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఐ నిజాం ఆధ్వర్యంలో శనివారం కూల్చివేశారు. అదేవిధంగా పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 422లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ షెడ్డును నిర్మిస్తుండటంతో జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు.