మంచిర్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా న స్పూర్ మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలను మంగళవారం అధికారులు కూల్చివేశారు. నస్పూర్‌లోని ప్ర భుత్వ భూమిని గోపాల్‌రావు ఆక్రమించి నిర్మాణం చేపట్టాడు. సర్వే అధికారులు తెలిపిన హద్దుల ప్రకారం ప్రభుత్వ భూమిలోని కట్టడాన్ని కూల్చివేశారు. కాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం తగద ని గోపాల్‌రావు పేర్కొన్నారు. కమిషనర్ సతీష్ రూ.14 లక్షలు డిమాండ్ చేశారని, తాను ఇవ్వనందుకే కక్షతో కూల్చివేత పూనుకున్నారని ఆరోపించారు.