calender_icon.png 22 February, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ చౌరస్తాలో అక్రమ షెడ్లు కూల్చివేత

20-02-2025 09:31:11 AM

ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): అంబేద్కర్ చౌరస్తాలో అక్రమంగా షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ(Ibrahimpatnam Municipality) అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ షెడ్ల కారణంగా రోడ్డు ఆక్రమణకు గురైన కారణంగా వాటిని తొలంగిచాలని కోర్టు ఆర్డర్ రావడంతో మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారి(Town Planning Officer) అధ్వర్యంలో గురువారం ఉదయం 4:30 గంటలకు పోలీసుల సమక్షంలో కూల్చివేతలు జరిపారు.

గతంలో ఈ నిర్మాణం తొలగించాలని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినప్పటికీ వారు తొలగించకపోవడంతో కోర్టు ఆర్డర్ రావడంతో అక్రమ నిర్మాణం కూల్చివేతలు చేయడం జరిగిందని మున్సిపాలిటీ కమీషనర్ రవీందర్ సాగర్(Municipal Commissioner Ravindra Sagar) తెలిపారు. గతంలో ఈ నిర్మాణం కూల్చాడానికి వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకున్న నోముల గ్రామానికి చెందిన దండేటికర్ రవి, సత్యనారాయణ. తమ దుకాణం కూల్చావద్దు అంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.