calender_icon.png 7 January, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్పలో హడలెత్తిస్తున్న హైడ్రా...!

05-01-2025 02:17:15 PM

ఆక్రమణలపై మరోసారి విరుచుకుపడ్డ హైడ్రా బృందం 

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓ భారీ అక్రమ భవనం కూల్చివేత

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ(Ayyappa Society)లో హైడ్రా హడలెత్తిస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్(Madhapur) డివిజన్ పరిధిలోని ఖానమెట్ విలేజ్ అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రహదారికి పక్కనే ఓ బిల్డర్ భారీ అక్రమ భవనాన్ని నిర్మించడంతో స్థానికంగా ఫిర్యాదులు వెలువెత్తాయి. సెల్లార్తో పాటు ఏడు అంతస్తుల  భవనం నిర్మించిన సదరు బిల్డర్ కు నోటీసులు జారీ చేసి కూల్చివేత మొదలుపెట్టింది హైడ్రా(Hydra). బిల్డింగ్ నిర్మాణం అక్రమమని హైకోర్టు ఇప్పటికే తేల్చి చెప్పింది. దీంతో యజమానికి జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు జారీచేశారు.

శనివారం అక్రమ భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) పరిశీలించారు. చుట్టుపక్కల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూల్చివేయాలని ఆదేశాలు జరిచేశారు. కాగా అక్రమ భవనం వద్దకు చేరుకోనున్న బాహుబలి క్రెన్. ఇప్పటికే జెసిపి సహాయంతో కూల్చివేతలు మొదలుపెట్టారు హైడ్రా సిబ్బంది. కూల్చివేతలకు ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తగా అక్రమ నిర్మాణం వద్ద భారీ పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఈ భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో 11కేవిఏ పవర్ సప్లై నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారులు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి.