calender_icon.png 3 April, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలందనగర్‌లో అంతస్తుల కూల్చివేత

26-03-2025 12:00:00 AM

కోర్టు ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు  

రాజేంద్రనగర్, మార్చి 25: అత్తాపూర్ డివిజన్ పరిధిలోని నలందనగర్ కాలనీలో  అనుమతులు లేకుండా నిర్మించిన ఓ భవన రెండు అంతస్తులను రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో కూల్చి వేశారు. భవన యజమాని అనుమతికి మించి రెండు అంతస్తులు అదనంగా వేశాడు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఐదు, ఆరవ అంతస్తులపై పొరుగింటి వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా భవన యజమాని పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం అదనపు అంతస్తులను పూర్తిగా కూల్చివేశారు. 

అంతా నేను చూసుకుంటా.. 

అక్రమంగా నిర్మిస్తున్న భవనాల యజమానుల నుంచి ఓ పార్టీ నాయకుడు అందిన కాడికి దండుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు వస్తే తాను చూసుకుంటానులే అంటూ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.