calender_icon.png 20 November, 2024 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలోని ఐదంతస్థుల భవనం కూల్చివేత

20-11-2024 12:38:50 PM

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పరిధిలో ఓ ఐదంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. ఒరిగిన భవనం కూల్చివేతను అధికారులు బుధవారం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. భవనం పైభాగం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రాలిక్ యంత్ర సహాయంతో భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. కాగా, భవనం నిన్న రాత్రి సిద్దిఖీ నగర్ లో పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే. ఘటనాస్థలిలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే భవన పరిసరాల్లో ఉన్న స్థానికులను ఇళ్ల నుంచి అధికారులు ఖాళీ చేయించారు.