ఖమ్మం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో భారీ వరదల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిలావస్థలకు చేరిన భవనాలు, ఇళ్లపై దృష్టిపెట్టారు. శుక్రవారం నగరంలో పలు పాత భవనాలను కూల్చివేశారు. భారీ వర్షాలు కురవడం, రోజుల తరబడి వరద నీటిలోనే పాత భవనాలు ఉండిపోవడంతో అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. శుక్రవారం ఆరు భవనాలు కూల్చివేశారు.