calender_icon.png 3 December, 2024 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచారం లేకుండా తమ ఇంటి నిర్మాణాన్ని కూల్చేశారు

21-11-2024 04:23:05 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తన తల్లిదండ్రుల ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణం కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని రడగంబాల బస్తి చెందిన ఎండి. ఖజా పాష, సల్మా జబీన్ లు తమ స్వంత స్థలంలో ఇంటిని నిర్మాణం చేపడుతుంటే అధికారులు ఎలాంటి నోటీసులు ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారుల చర్య వల్ల తాము రూ.5 లక్షల వరకు నష్టపోయమని చెప్పారు. అధికారులు తమకు నష్ట పరిహారం అందించి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని వారు వేడుకున్నారు.