calender_icon.png 2 April, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్చివేసిన స్మశాన వాటిక మినార్లు..

24-03-2025 08:20:55 PM

ఇద్దరు నిందితుల రిమాండ్..

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో ముస్లిం స్మశానవాటిక మినార్లను కూల్చివేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మహాదేవపూర్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ... ఆదివారం అర్ధరాత్రి తాగిన మత్తులో తమ ఇంటి దగ్గరలో ఉన్న స్మశాన వాటిక ద్వారం మినారులను నసుపురి సాగర్, జోడు పవన్ అనే ఇద్దరు నిందితులు పగలగొట్టినట్లు విచారణలో ఒప్పుకున్నారని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ కేసు ఉదయం నుండి ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో డీఎస్పీని కలిసి నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు దర్యాప్తును ప్రారంభించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇట్టి సంఘటనపై ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని అతి తక్కువ కాలంలో చేదించిన మహాదేవపూర్ పోలీసులు మహదేవపూర్ సీఐ రామచంద్రారావు, ఎస్సై పవన్ కుమార్, పలిమల ఎస్సై రమేష్, కాలేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి, సిబ్బంది తదితరులు డీఎస్పీ అభినందించారు.