calender_icon.png 3 April, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌కు వ్యతిరేకంగా 25 గంటల ప్రసంగం

02-04-2025 11:57:27 PM

అరుదైన రికార్డు నెలకొల్పిన డెమోక్రటిక్ సెనెటర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై స్వదేశంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.  ఈ క్రమంలో విపక్ష సెనెటర్ అరుదైన రికార్డు నెలకొల్పారు. అధ్యక్షుడి విధానాలను వ్యతిరేకిస్తూ 25 గంటల పాటు ప్రసంగించారు. దీంతో సెనెట్ చరిత్రలోనే సుదీర్ఘ ప్రసంగం చేసిన సభ్యుడిగా డెమోక్రటిక్ నేత కోరి బుకర్ అరుదైన ఘనత సాధించారు. న్యూజెర్సీ సెనెటర్, డెమోక్రటిక్ నేత కోరి బుకర్ ఈ ఫీట్ చేశారు.

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం సెనెట్ ఫ్లోర్ ఎక్కి ప్రసంగం ప్రారంభించిన ఈ 55 ఏళ్ల నేత రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఆయన ప్రసంగం సాగింది. మొత్తంగా 25 గంటల 5 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. దీంతో 1957లో పౌరహక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ రిపబ్లికన్ నేత స్ట్రోమ్ థర్మోండ్ చేసిన ప్రసంగం రికార్డును కోరి బద్దలు కొట్టారు.