- అధికారికంగా ప్రకటించిన పార్టీ
- డొనాల్డ్ ట్రంప్‌తో ఇక అమీతుమీ
వాషింగ్టన్, ఆగస్టు 2: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కోబోయే ప్రత్యర్థి అధికారికంగా ఖరారయ్యా రు. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ను అధికార డెమోక్రాటిక్ పార్టీ తన అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. అనారోగ్య కారణాలతో ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ వైదొలిగిన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. కమలకు మద్దతుగా, వ్యతిరేకంగా పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. అయితే, ఎన్నికల సర్వేల్లో ట్రంప్‌కంటే కమలకే ప్రజల మద్దతు అధికంగా ఉన్నట్టు తేలటంతో డెమోక్రాటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ కమలా హ్యారిస్ కావటం విశేషం. 2016లో డెమోక్రాటిక్ పార్టీ తరఫునే హిల్లరీ క్లింటన్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.