calender_icon.png 9 March, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటుతోనే ప్రజాస్వామ్య మనుగడ

26-01-2025 12:11:52 AM

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్‌రెడ్డి 

మంథని: జనవరి 25 (విజయ క్రాంతి): ఓటుతోనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమని, ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటు పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి అన్నారు.

శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని మంథని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ మనోహర్ నిర్వహించిన ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమంలో  చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ఓటు హక్కు ద్వారానే సమర్థవంతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్లు వీకే. రవి, గుండా విజయలక్ష్మి పాపారావు, నక్క నాగేంద్ర శంకర్, కొట్టే పద్మ రమేష్, చొప్పకట్ల హనుమంతరావు, కుర్ర లింగయ్య, వేముల లక్ష్మి సమ్మయ్య, కాయితి సమ్మయ్య, ఆరెల్లి కుమార్, మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

 కోరుట్ల పట్టణంలో ..

కోరుట్ల, జనవరి 25 : కోరుట్ల పట్టణంలో శనివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్ స్టాండ్  నుంచి జాతీయ రహదారి వెంబడి నంది చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నందిచౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి, ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు.

ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీవో జివాకర్ రెడ్డి , డిఎస్పీ అడ్డూరి రాములు మాట్లాతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అని, 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ ఇట్యాల కిషన్, సీఐ సురేష్ బాబు, ఎస్త్స్ర శ్రీకాంత్, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.