21-04-2025 12:00:00 AM
- మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారి లక్ష్మారెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 21 : సరూర్ నగర్ డివిజన్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ’జై బాపు- జై భీమ్- జై సంవిధాన్’ నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ భార్గవ్ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిచెన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... జై భీమ్ జై బాబు జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందన్నారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం విధానాలను ప్రజలు వివరించాలని కార్యకర్తలుకు పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ భారత్ జోడయాత్ర ద్వారా దేశ ప్రజలను సమనత్వం చైతన్యవంతం చేశారని అన్నారు. 11 ఏండ్లుగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలని కాలగర్భంలో కలిపేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ యాదవ్, కాంగ్రెస్ సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ యాదవ్, నాయకులు ధనరాజ్ గౌడ్, చిక్కుళ్ళ శివ ప్రసాద్, గుల్షన్, షఫీ, గంగమ్మ, కిశోర్, యూనుస్, అజీజ్, సంతోష్ కుమార్, నాగరాజు, భాస్కర్, జంగారెడ్డి, చిన్న యాదవ్, రంజిత్, అరుణ,సంగీత, శైలజ పాల్గొన్నారు.