calender_icon.png 27 November, 2024 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీతో ప్రజాస్వామ్యం ఖూనీ

27-11-2024 02:33:51 AM

రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పాలన

పీసీసీ ఛీప్ మహేశ్‌కుమార్

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విధానా లకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. గాంధీభవన్‌లో మం గళవారం పీసీసీ ఇంటలెక్చవల్  కమిటీ చైర్మ న్ అనంతుల శ్యామ్‌మోహన్ అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటుపీసీసీ మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు, ప్రొఫెసర్ తిరుమలి, నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భం గా పీసీస చీఫ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో సమాన హక్కులు అనేది అత్యంత కీలకమైన అంశమని  అన్నారు. బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రయోజనాలను పొందాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజ్యాంగ విధానాలను అమలు చేయాలని కోరుతున్నారని, అందుకే దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాన హక్కుల కల్పన, కులగణన లాంటి పనులు చేస్తూ రాజ్యాంగ ఫలాలను ప్రజలకు పంచుతున్నామని తెలిపారు. కాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సంవిధాన్ దివస్ సభను గాంధీభవన్‌లో నిర్వహించగా, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షులు వరుణ్‌చౌదరి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.