calender_icon.png 23 December, 2024 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ

23-12-2024 12:56:58 AM

  1. రైతు భరోసాపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం 
  2. బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్

హైదరాబాద్, డిసెంబర్ 2౨ (విజయక్రాంతి): అసెంబ్లీలో నిబద్ధతగా ఉండాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. నిరుద్యోగ అంశం, బీసీ రిజర్వేషన్లపై కంటితుడుపు చర్యగా చర్చిం చారని విమర్శించారు.

సభలో తాను చెప్పిందే  వేదం అన్నట్టు రేవంత్‌రెడ్డి భావిస్తున్నాడని మండిపడ్డారు. అల్లు అర్జున్‌పై ఏ కుట్ర ఉందో తెలియదు కానీ.. ఆయనను  లొంగదీసుకోవాలని ఎత్తులు వేస్తున్నారని విమర్శిం చారు. ‘ప్రైవేట్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి సహాయం ఎలా ఇస్తాడు.

రేవంత్‌రెడ్డి.. రేవతి చావులో నీ పాత్ర ఉందని బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చావ్’ అని నిలదీశారు. ఓడిపోయి న చోట గెలిపించిన రైతులను జైలు కు పంపారని మండిపడ్డారు. అప్పు ల విషయంలోనూ సభలో అబద్ధా లు చెబుతున్నాడని విమర్శించారు.