calender_icon.png 25 October, 2024 | 7:51 AM

ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేశారు

29-07-2024 01:33:11 AM

ది వైర్ సీనియర్ సంపాదకులు అర్ఫా ఖానుమ్ షెర్వాణి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేసి ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని ‘ది వైర్’ పత్రిక సీనియర్ సంపాదకురాలు అర్ఫా ఖానుమ్ షెర్వాణి తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రచయితలు, ఉద్యమకారులు, మైనార్టీలపై అణిచివేత దోరణి అవలంభించిందని ఆమె ద్వజమెత్తారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీవీవీ అధ్యక్షులు అంబటి నాగయ్య అధ్యక్షతన తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 13వ స్మారకోపన్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ది వైర్ సీనియర్ సంపాదకులు అర్ఫా ఖానుమ్ ‘సమకాలిన భారతీయ సమాజం సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు.

ఆమె మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కేంద్రంలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. ప్రధాని మోదీ తనకు తానుగా సమతా ధర్మ పరిరక్షకుడిగా, నూతన హిందూ రాజ్య చక్రవర్తిగా ఊహించుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీవీవీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, ఉపాధ్యక్షులు రమాదేవి, కొండా నాగేశ్వర రావు, ప్రముఖులు చంద్రశేఖర్, జీవన్ కుమార్, కేవీఎల్, కాచం సత్యానారాయణ, టీవీవీ హైదరాబాద్ నగర నాయకులు ఇనప ఉపేందర్, ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్, ఉస్మానియా స్టూడెంట్ జేఏసీ నాయకులు శ్వేత తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాపటానికి నివాళులర్పించారు.