calender_icon.png 25 December, 2024 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీమార్ట్ నికరలాభం 6 శాతం వృద్ధి

14-10-2024 02:03:18 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: డీమార్ట్ రిటైల్ సోర్లను నిర్వహించే ఎవిన్యూ సూపర్ మార్ట్  కన్సాలిడేటెడ్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 5.78 శాతం వృద్ధిచెంది రూ.659.44 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో రూ.623.35 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్యూ2లో కంపెనీ అమ్మకాల ఆదాయం 14.41 శాతం పెరిగి రూ. 12,624 కోట్ల నుంచి రూ. 14,444 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో 6 కొత్త డీమార్ట్ స్టోర్లను తెరిచామని, వీటితో తమ మొత్తం స్టోర్ల సంఖ్య 377కు చేరిందని ఎవిన్యూ సూపర్ మార్ట్ తెలిపింది.