calender_icon.png 24 December, 2024 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

24-12-2024 12:50:54 AM

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 23: సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు గత 14రోజు లుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల కోసం నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.  ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వైశ్యా మ్యాలు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులకు కూడా పురి గొలిపారని ఆరోపించారు.

ఆశాస్త్రీయంగా జోన్ల విభజన చేశారని 317 జీవో తీసుకొచ్చి స్థానికతను తుంగలో తొక్కారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివి జరగకుండా మొదటి తారీకు నే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నందుకు, ఉద్యో గుల సమస్యల పరిష్కారం కోసం త్రీ మెన్ కమిటీ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన  ఏర్పాటు చేయడం యావత్తు ఉ ద్యోగుల జేఏసీ పక్షాన సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్య క్రమంలో జిల్లా నాయకులు కాలిచరన్, లక్షణ రావు, కేశవ రెడ్డి పాల్గొన్నారు.