calender_icon.png 16 January, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిమాండ్లను పరిష్కరించాలి

11-12-2024 06:43:36 PM

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శృతిక...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శృతిక స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చేపడుతున్న సమ్మె బుధవారానికి రెండు రోజులు చేరుకుంది. ఈ సందర్భంగా శృతిక మాట్లాడుతూ.. ఎస్పీడీ, ఎస్ఎస్సి ఉద్యోగ సంఘాలతో చేపట్టిన చర్చలు విఫలమయాయని తెలిపారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ తక్షణమే రెగ్యులర్ చేసి పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో శ్రమ దోపిడీకి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు నాగ సుధా, ప్రధాన కార్యదర్శి తుకారం, గౌరవ అధ్యక్షులు మోహన్, కోశాధికారి నాగేష్, మీడియా ప్రతినిధి సంతోష్, కేజీబీవీ ప్రత్యేక అధికారి రమాదేవి, మీనా, కార్యదర్శులు సందీప్, రాజేష్, సిసిఓ అధ్యక్షుడు అనుప్, ఎంఐఎస్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఐఈపిఆర్పి అధ్యక్షుడు వెంకటరమణ, డిపిఓలు రాము, మల్లేష్ పిటిఐ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.