calender_icon.png 11 April, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు

04-04-2025 12:00:00 AM

గాలి దుమారానికి నేలకొరిగిన వరి పంట

ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి  రైతులను ఆదుకోవాలని డిమాండ్

కామారెడ్డి, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి), అకాల వడగండ్ల వర్షానికి వరి పంట జిల్లాలో తీవ్రంగా దెబ్బతింది. గాలి దుమారం తో పాటు ఈదురు గాలులు వడగండ్ల వాన జోరుగా కురవడంతో చేతికొచ్చిన వారి పంట నేలరాలడంతో పాటు నేల వాలింది. గురువారం సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గం లోని కామారెడ్డి, దోమకొండ,, మాచారెడ్డి, భిక్కనూర్, రామారెడ్డి, తాడ్వాయి, మండలాలతోపాటు  ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని గాంధారి, సదాశివ నగర్, లింగంపేట్ నాగిరెడ్డిపేట్ ఎల్లారెడ్డి మండలాల లోని ఆయా గ్రామాల్లో అకాల వడగండ్ల వర్షం కురవడంతో వరి పంట నేలకొరిగింది.

జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద పిట్లం పెద్ద కొడప్గల్ జుక్కల్ నిజాంసాగర్ తదితర మండలాల్లో అకాల వర్షం భారీగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. గంటపాటు వర్షం ఈదురుగాలితో కూడిన వడగండ్ల వర్షం పడడంతో మరో వారం పది రోజుల్లో కోతకు వచ్చిన వరి పంట నేలకొరకడమే కాకుండా వరి గింజలు నేలరాలాయి. తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తున్నారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.