11-03-2025 01:09:41 AM
మద్దతు ధర కల్పించాలని డిమాండ్
నిజామాబాద్, మార్చి 10 (విజయ క్రాంతి) : అడగాలం కష్టపడి పండించిన తమ పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని తమ పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పసుపు రైతులు నగరంలోని ప్రధాన రోడ్డు బస్టాండ్ ఎదురుగా ధర్నాకు దిగారు. రైతుల ధర్నాతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు ఆగి భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.తమ పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పసుపు రైతులు సోమవారం నగరంలోని ప్రధాన రహదారి బస్టాండ్ దగ్గర ధర్నాకు దిగారు. మార్కెట్ కమిటీ నుండి నేరుగా రైతులు బస్టాండ్ వద్దకు చేరుకొని నగర ప్రధాన రోడ్డులో బైఠాయించడంతో ట్రాఫిక్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మండుటెండను సైతం చేయకుండా రైతులు ధర్నాలో పాల్గొన్నారు.
నిజామాబా ద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో దళారులతోని మోసం చేస్తున్నారంటూ తమ పసుపు పంటకు ధర రాకుండా వ్యాపారులు దళారులు కుమ్మక్కయ్యారని వారు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బస్టాండ్ వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పినప్పటి కీని రైతులు ఆందోళన విరమించలేదు .రైతులకు నచ్చ చెప్పడానికి పోలీసులు తంటలు పడ్డారు.