calender_icon.png 17 November, 2024 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకం తగ్గింపుతో పెరిగిన పుత్తడి డిమాండ్

31-10-2024 12:26:16 AM

  1. విలువలో 53 శాతం, పరిమాణంలో 18 శాతం పెరుగుదల
  2. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్

న్యూఢిల్లీ, అక్టోబర్ 30:  కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకా న్ని తగ్గించడంతో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో బంగా రానికి డిమాండ్ 18 శాతం వృద్ధిచెంది 248.3 టన్నులకు చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో వెల్లడించింది.

నిరుడు ఇదేకాలంలో దేశంలో బంగారం డిమాండ్ 210.3 టన్నులుగా నమోదయ్యింది. విలువ రీత్యా బంగారం డిమాండ్ 53 శాతం పెరిగి రూ.1,07,700 కోట్ల నుంచి రూ. 1,65,380 కోట్లకు చేరినట్లు డబ్ల్యూజీసీ ఇండియా రీజనల్ సీఈవో సచిన్ జైన్ చెప్పారు.

ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగ తి తెలిసిందే. 2024 క్యాలండర్ సంవత్సరం క్యూ3 (జూలై-సెప్టెంబర్)లో గోల్డ్ ట్రెండ్స్‌పై ఒక రిపోర్ట్‌ను బుధవారం డబ్ల్యూజీసీ విడుదల చేసింది. వివరాలు..

* భారత్‌లో ఈ పూర్తి సంవత్సరం బంగారం డిమాండ్ 700-750 టన్నుల శ్రేణిలో ఉంటుందని అంచ నా. 2023లో నమోదైన 761 టన్నుల డిమాండ్‌కన్నా ఇది కాస్త తక్కువ.

* ధనతెరాస్, దీపావళి, పెండ్లిళ్ల సీజన్ మొత్తంమీద పుత్తడి డిమాండ్ ఊతమిస్తుందని అంచనా

* దేశంలో జ్యువెలరీ డిమాండ్ ఈ జూలై-సెప్టెంబర్‌లో 10 శాతం వృద్ధితో 155.7 టన్నుల నుంచి 171.6 టన్నులకు పెరుగుదల

* జూలై ద్వితీయార్థం నుంచి వినియోగ డిమాండ్ బాగా పుంజుకుని, సెప్టెంబర్ మధ్య వరకూ పటిష్టంగా కొనసాగింది

* సుంకాల తగ్గింపుతో పాటు రిజర్వ్‌బ్యాంక్ జరిపిన వరుస కొనుగోళ్లు, సానుకూల రుతుపవనాల ప్రభావం తో టైర్‌టూ పట్టణాలు, గ్రామీణ ప్రాం తాల్లో వృద్ధి కూడా బంగారం డిమాం డ్ పెరుగుదలకు మరో కారణం

* ఈ క్యూ3లో భారత్‌లో బంగారానికి పెట్టుబడుల డిమాండ్ 41 శాతం వృద్ధితో 54.5 టన్నుల నుంచి 76.7 టన్నులకు పెరుగుదల

* జ్యువెలరీని రీసైకిల్ చేయడం ద్వారా  భారత్ మార్కెట్లోకి వచ్చిన బంగారం 22 శాతం పెరిగి 19.2 టన్నుల నుంచి 23.4 టన్నులకు చేరింది. 

* బంగారం ధర భారీగా పెరగడంతో సుంకం తగ్గింపు ప్రయోజనం ఆవిరైపోయినందున, రానున్న రోజుల్లో బంగారం డిమాండ్‌పై ప్రభావం చూపించవచ్చు. అయితే ఇన్వెస్టర్లు వారి హోల్డింగ్స్‌ను పెంచుకునేందుకు ధర తగ్గుదల కోసం వేచిచూస్తున్నారని డబ్ల్యూజీసీ పేర్కొంది.

* దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా 87 శాతం పెరిగి 193 టన్నుల నుంచి 360.2 టన్నులకు చేరిక

* రిజర్వ్‌బ్యాంక్ బంగారం నిల్వలు 6 శాతం వృద్ధితో 854 టన్నులకు చేరిక.