calender_icon.png 3 April, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ ఆక్రమణపై విచారణకు డిమాండ్

01-04-2025 01:11:13 AM

కొత్తపల్లి, మార్చి 31 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని శ్రీపురం కాలనీ మెయిన్ రోడ్డు ను ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 100లో భూ అక్రమనలు  జరిగా యని గత రెండు రోజులుగా టెంట్లు వేసు కుని నిరసన తెలుపుతున్న పట్టించుకునే నాధుడు లేకపోవడం పట్ల సిపిఐ నగర సమితి  తీవ్రంగా ఖందించింది. ఏడు దశా బ్దాలకు పైగా గడప పర్వతాలు పేరిట ఉన్న టువంటి 61 గుంటల స్థలాన్ని రేనే హాస్పి టల్ డాక్టర్ బంగారు స్వామికబ్జా చేయడం విచారకరమన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు బాధితుల శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. కబ్జాలు చేస్తున్న వారు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని, అధికార పార్టీ నాయకులపై వారి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తామని   హెచ్చరించారు.