calender_icon.png 23 March, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పోచారం చేసిన అక్రమాలపై విచారణ జరపాలి

22-03-2025 06:34:31 PM

మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి నాయకులు

డబుల్ బెడ్ రూమ్ అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్

బాన్సువాడ,(విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు చేసి బిల్లులు ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడ్డ వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బిజెపి ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సొంత డబ్బులు పెట్టి నిర్మించుకున్న వారికి బిల్లులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పించలేదని అవకతవకలకు పాల్పడ్డారని విచారణ చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ ఇండ్లు, 10% భూములు, ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్ ఇవ్వడంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ చేశారు.

ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్  శ్రీనివాస్(BJP Assembly Convener Srinivas) మాట్లాడుతూ  గత కొన్ని సంవత్సరాలుగా బాన్సువాడ పట్టణంలో అక్రమ ఇండ్లు ప్రభుత్వ భూములు కబ్జాపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ వల్లనే అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలను బిపిఎల్ కోట కింద ఇళ్ల స్థలాలను ప్రభుత్వం నుండి పొందిన వారు కొందరు ఇండ్ల స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ విక్రయిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎదుట ధర్నా చేస్తున్న బిజెపి నాయకుల వద్దకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

వారం రోజుల్లో అక్రమ ఇళ్లపై చర్యలు తీసుకుంటానని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో బిజెపి నాయకులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, రుద్రూర్ మండల అధ్యక్షులు హరి, బీర్కూర్ మండల అధ్యక్షులు సాయి, కిరణ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా కార్యదర్శి శేఖర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి హనుమాన్లు ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీత, బిజెపి నాయకులు కొనాల గంగారెడ్డి, పాశం భాస్కర్ రెడ్డి, సాయి సిద్ధార్థ, సాయి ప్రసాద్, రామకృష్ణ, సాయి రెడ్డి, ఉమేష్, అంజయ్య, దత్తు యోగి, ప్రణయ్, సంతు పటేల్, శివకుమార్, లక్ష్మణ్, హనుమాన్లు, పోల్కం గోపాల్, చామకూర సాయిలు, సిద్ది బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.