యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలో బస్సులలో దేవుళ్ళ ఫోటోలు తొలగించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట పట్టణ శాఖ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్వామి వారి ఫోటోలు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే బిజెపి పార్టీ తరపున ఆర్టీసీ డిపో ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బిజెపి మండల శాఖ పట్టణ శాఖ బజరంగ్దళ్ విశ్వవిందు పరిషత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు