calender_icon.png 20 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం దేవస్థానంకు డీలక్స్ బస్సు ఏర్పాటు

18-04-2025 12:00:00 AM

కామారెడ్డి డిపో మేనేజర్ కరుణశ్రీ

కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి), భద్రాచలం దేవస్థానానికి కామారెడ్డి డిపో నుంచి  డీలక్స్ బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణ శ్రీ తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని భద్రాచలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి ఉదయం 7:30 కు హైదరాబాదు నుంచి కామారెడ్డికి బస్సు సౌకర్యం కలదని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భద్రాచలం కు కామారెడ్డి నుంచి రాత్రి 8 గంటలకు  బయలుదేరి భద్రాచలం కు ఉదయం ఐదున్నర గంటలకు చేరుకుంటుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి హైదరాబాదుకు డీలక్స్ బస్సు సౌకర్యం కల్పించి నట్లు డిపో మేనేజర్ కరుణా శ్రీ విజయ క్రాంతి తో తెలిపారు.