calender_icon.png 18 November, 2024 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ

29-06-2024 01:37:41 AM

గజ్వేల్, జూన్ 28 : గత ప్రభుత్వం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి రాజమౌళి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో వైస్ చైర్మన్ జకియోద్దీన్, కౌన్సిలర్లతో కలిసి ఆర్డీవో బన్సీలాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. గజ్వేల్ పట్టణంలో పేదలు ఇంటి కిరాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని, లాటరీలో ఎంపికైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయాలని కోరారు. ఇందుకు ఆర్డీవో సానుకూలంగా స్పందించారు. 

అభివృద్ధి పనులపై ఏకగ్రీవ తీర్మానం..

ప్రస్తుతం మిగిలి ఉన్న 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రాబోయే 15వ ఆర్థిక సంఘం నిధులతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో రూ.10 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టాలని పాలకవర్గం నిర్ణయించింది. శుక్రవారం నిర్వహించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో 19 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో పాటు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోల్కోండ నర్సయ్య, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.