calender_icon.png 28 February, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ ఫోన్ల అప్పగింత

28-02-2025 07:55:43 PM

కాటారం (విజయక్రాంతి): వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా దొరకపట్టినట్లు, వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగించామని కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు. దొంగతనానికి గురైన లేదా అనుకోకుండా తమ నుండి పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను బాధితులు సిఈఐఆర్ పోర్టల్ ను సంప్రదించి, వివరాలు అందించిన యెడల వీలైనంత త్వరలో సెల్ ఫోన్ లను దొరకపట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.