02-04-2025 12:14:00 AM
దౌల్తాబాద్, ఏప్రిల్ 1: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన మహిళకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా దౌల్తాబాద్ 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాను, పైలెట్ నర్సింలు చేరుకొని గజ్వేల్ హాస్పిటల్ కి తరలించే క్రమంలో మహిళకి నొప్పులు అధికమవడంతో సిబ్బంది ప్రసవం చేశారు. ఆడబిడ్డకి జన్మనివ్వగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగానే సమయానికి వచ్చిన అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.