22-03-2025 03:13:42 PM
చరిత్ర మనల్ని క్షమించదు.. భవిష్యత్తు తరాలు ప్రశ్నిస్తాయి: కేటీఆర్
చెన్నై: కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. కేంద్ర వివక్షపూరిత విధానాలతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు. దేశ అభివృద్ధి కోసం పనిచేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని కేటీఆర్(KTR) హెచ్చరించారు. డీలిమిటేషన్.. దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తోందన్నారు. డీలిమిటేషన్ తో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న రాష్ట్రాలకు లాభం జరుగుతోందని కేటీఆర్ తెలిపారు.
డీలిమిటేషన్ తో నిధుల కేటాయింపుల్లో తీవ్ర నష్టం జరుగుతోందని, అధికారం పేర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశముందన్నారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతోందని తెలిపారు. జరుగుతున్న నష్టంపై మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదని తెలిపారు. భవిష్యత్తు తరాలు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ కేంద్రంపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం(Bharatiya Janata Party Govt) వివక్ష చూపిస్తోందన్నారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందన్నారు. కేంద్రం వివక్షతో ఇప్పటికే దక్షిణాది నష్టపోతోందని సూచించారు.
ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదన్న కేటీఆర్ నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని, దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని ఆయన వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్రమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఆధ్వర్యంలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని గుర్తుచేశారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు.. (tyranny of majority) తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్య రాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.