calender_icon.png 4 April, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభా ఆధారంగా డీలిమిటేషన్ అంగీకరించం

28-03-2025 01:53:34 AM

  1. కశ్మీర్‌లో జనాభా ప్రతిపాదికన.. సిక్కీంలో క్యాబినేట్ నిర్ణయంతో అసెంబ్లీ స్థానాల పెంపు
  2. తెలంగాణ, ఏపీలో కనీసం ఆ స్థానాలైనా పెంచలేదు..
  3. తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వివక్ష: సీఎం రేవంత్‌రెడ్డి
  4. అసెంబ్లీలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా బిల్లు

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాం తి): జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేస్తే దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోతాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో డీలిమిటేషన్ అమలుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు గురువారం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సీఎం డీలిమిటే షన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  కేంద్రం జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచిందని, 2018లో సిక్కీంలో కేబినెట్ తీర్మానం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రి య కొనసాగుతుందని గుర్తుచేశారు. ఇలాం టి కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజలకు చాటిచెప్పేందుకే తమ ప్రభుత్వం అసెం బ్లీలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడుతున్నదని స్పష్టం చేశారు.

ఏపీ పునర్విభజన చట్టం 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు పెంచాలని ఈ సభ తీర్మానిస్తుందన్నారు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశ పెట్టాలని సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నదని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విష యంలో కేంద్రం ఏపీ, తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని ఆరోపించారు. 

దక్షిణాది రాష్ట్రాలకు నష్టం..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిలో కేవలం 130 స్థానాలు మాత్రమే ఉన్నాయన్నారు. దక్షిణా ది రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం డీలిమిటేషన్ అస్త్రాన్ని వినియోగించేందుకు సిద్ధమవుతున్నదని ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు ప్రదర్శిస్తున్నదని, డీలిమిటేషన్ ప్రక్రియపై రాష్ట్ర ప్రభు త్వాలను సంప్రదించకుండానే విధి విధానాలు రూపొందించేందుకు సిద్ధమవుతున్న దని ఆరోపించారు.

ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు జరిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్రాలకు శాపం కాకూడదన్నారు. దక్షిణాది రాష్ట్రా దశాబ్దాలుగా కుటు ంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రా లే నష్టపోతాయన్నారు.

జనాభా తగ్గినంత మాత్రాన రాష్ట్రాలు నష్టపోకూడదని ఆకాంక్షించారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను యథా తథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని, ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందన్నారు. 

తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లను పెంచాల్సి ఉందని, అలాగే మహిళలకూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. డీలిమిటేషన్‌తో రాష్ట్రాలు నష్టపో తాయని నాటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారని, అందుకే ఆ చట్టాన్ని సవరించారని గుర్తించారు.

కేంద్ర  ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే సమిష్టి పోరాటానికి సిద్ధమవుతామని తేల్చిచెప్పారు. డీలిమిటేషన్‌పై అభిప్రాయాల సేకరణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.