calender_icon.png 22 February, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తోటమల్ల నియామకం పట్ల హర్షం

21-02-2025 07:08:16 PM

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ మాల మహానాడు అధ్యక్షులుగా తోటమల్ల రమణ మూర్తిని నియమించడంతో మాల మహానాడు జిల్లాలో బలమైన శక్తిగా మారనున్నదని మాల మహానాడు మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు అన్నారు. జాతీయ మాల మహానాడు జిల్లా నూతన అధ్యక్షులుగా తోటమల్ల రమణ మూర్తిని రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జిల్లా ఇన్ఛార్జ్ అశోద భాస్కర్ బుధవారం నియమించిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో ఆయన నియామకాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల అధ్యక్షులు గోపాలరావు మాట్లాడుతూ... రమణమూర్తి నియామకంతో జిల్లాలో మాల మహానాడు బలమైన శక్తిగా మారనున్నదని జోస్యం చెప్పారు.

ఆయన నియామకానికి కృషి చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి దయాకర్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జిల్లా ఇన్ ఛార్జ్ అశోద భాస్కర్, రాష్ట్ర పొలిటి బ్యూరో సభ్యులు చిట్టిమల్ల సమ్మయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ పై వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. దళితులు ఐక్యమత్యంగా ఉండి రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.దళితులకు 20 శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు.2014 నుండి ఎస్సీ కులగణన  చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య, భద్రాచలం నియోజకవర్గం నాయకులు తోటమల్ల విజయరావు, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ బోళ్ల వినోద్, నాయకులు కుప్పా నిరంజన్, దొడ్డా వెంకటేశ్వర్లు, చింతల నాగేంద్ర, మంచాల చంటి తదితరులు పాల్గొన్నారు.