calender_icon.png 5 February, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలి

05-02-2025 04:18:51 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

మందమర్రి (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు వినియోగదారులకు నాణ్యమైన రుచికరమైన అల్పాహారం, భోజనాలు అందించి వ్యాపారాలు వృద్ధి చేసుకోని ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలనీ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఆవరణలో మందమర్రి మండల సమాఖ్య ఆధ్వర్యంలో 8 లక్షల వ్యయంతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను బుధవారం అస్తమా ప్రారంభించి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని కోరారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అల్పాహారం భోజనం రుచికరంగా అందించి వ్యాపారాలను విస్తరించాలన్నారు. ముఖ్యంగా క్యాంటీన్లో తయారు చేసిన వంటకాలను హోమ్ డెలివరీ చేసి వ్యాపారాలను విస్తృతం చేయాలన్నారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులకు హైదరాబాద్ లో తెలంగాణ వంటకాలపై తగిన శిక్షణ ఇప్పించడం జరిగిందని శిక్షణ పొందిన మహిళలు రుచికరమైన వంటకాలను అందించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకుగాను ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రారంభించిన క్యాంటీన్ లో నాణ్యమైన వంటకాలు ప్రజలకు అందిస్తున్నారనీ, అదే స్థాయిలో పట్టణంలోని క్యాంటీన్ లో నాణ్యమైన వంటకాలను వినియోగదారులకు అందించి వారి ఆదరాభిమానాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభి వృద్ధి కోసం ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఎస్ కిషన్, ఐకెపి డిపిఎం స్వర్ణలత, ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, తహసిల్దార్ సతీష్ కుమార్, ఐకెపి ఏపీఎం లలిత, ఈజీఎస్ ఏపీఓ రజియా సుల్తానా, తహసిల్దార్ మండల పరిషత్ కార్యాలయాల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.