calender_icon.png 14 April, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా సంస్థపై కావాలనే అసత్య ఆరోపణలు

13-04-2025 12:00:00 AM

-జీనియస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ వెల్లడి

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 12: మా సంస్థపై కావాలనే కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని జీనియస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, అనాజ్‌పూర్ గ్రామంలో ఉన్న  ఇందిరమ్మ సాగర్, వేముల కత్వా యొక్క ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను మా జీనియస్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఆక్రమిస్తుందని కొంతమంది చేసిన ఆరోపణలను శనివారం మీ దినపత్రికల్లో ప్రచురణ చేశారు. వారు చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా ఆవాస్తవం... మేము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు.

ఆక్రమించుకోవా ల్సిన అవసరం మా సంస్థకు లేదని జీనియస్ సంస్థ పేర్కొంది. అనాజ్పూర్ గ్రామంలోని ఇందిరమ్మ సాగర్, వేముల కత్వాల వరకు ఉన్న మా పట్టా భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇచ్చిన సర్వే మ్యాప్ ప్రకారమే మా యొక్క భూమికి సరిహద్దు లు ఏర్పాటు చేసుకుని చదును చేస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ విషయం అర్థంకాక కొంతమంది కావాలనే మా యొక్క సంస్థకు చెడ్డ పేరు వచ్చే విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అలాంటి ఆరోపణలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం.