11-02-2025 01:08:10 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఢిల్లీలో గెలిచిన బీజేపీ పార్టీకి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మహిళల్లోంచే ఒకరికి సీఎం కుర్చీ దక్కనున్నట్లు తెలుస్తోంది. మహిళకు లేదా దళిత నేతకు ఢిల్లీ సీఎం పీఠం దక్కనుందనే వార్తలు జోరుగా వినిపిస్తు న్నాయి.
బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో రేఖా గుప్తా, శిఖా రాయ్, పూనమ్ శర్మ, నీలం పెహల్వాన్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో పక్క గెలుపు లో కీలకపాత్ర పోషించిన పర్వేశ్ వర్మకే సీఎం పగ్గాలు దక్కుతాయని కూడా ప్రచారం జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారం దక్కించుకుంది. ఎవరు సీఎంగా బాధ్యత తీసుకున్నా కానీ.. సీఎం అధికార నివాసం (శీష్ మహల్)లో ఉండరని బీజేపీ పేర్కొంది.