calender_icon.png 7 April, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ‘హ్యాట్రిక్’.. రాజస్థాన్‌కు రెండో విజయం

06-04-2025 12:32:22 AM

  • 25 పరుగులతో చెన్నై పరాజయం

మరో మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి

నేడు గుజరాత్‌తో హైదరాబాద్ ‘ఢీ’

చెన్నై/ముల్లన్‌పూర్, ఏప్రిల్ 5: ఐపీఎల్ 18వ సీజన్‌లో శనివారం డబుల్ హెడర్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయ ల్స్ విజయాలు సాధించాయి. శనివారం చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయాన్ని సాధించి హ్యాట్రిక్ గెలుపు అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (77) అర్థసెంచరీతో రాణించాడు.

చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై సూపర్ కిం గ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులకు పరిమితమైంది. విజయ్ శంకర్ (69 నాటౌట్) మెరవగా.. విప్రజ్ నిగమ్ 2 వికెట్లు తీశాడు. 

రాజస్థాన్‌దే గెలుపు..

ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగులు తేడాతో గెలుపొందింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ (67) అర్థశతకంతో ఆకట్టుకోగా.. పరాగ్ (43 నాటౌట్) మెరిశాడు.

ఫెర్గూసన్ 2 వికెట్లు తీశా డు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికె ట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నిహాల్ వధేరా (62) టాప్ స్కోరర్. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో మెరిశాడు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.