calender_icon.png 29 September, 2024 | 11:52 AM

అకాశాన్ని చూసిన ఢిల్లీవాసులు

29-09-2024 01:36:17 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దేశ రాజధాని ఢిల్లీలో చాలారోజుల తర్వాత ప్రజలు అందమైన ఆకాశాన్ని చూడగలిగారు. నగరంలో ప్రమాదకర స్థాయి లో ఉన్న గాలి నాణ్యత.. గురు, శుక్రవారాల్లో పూర్తి సాధారణ స్థాయికి చేర కుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో వరుసగా రెండు రోజుల పాటు వర్షాలు కురవడంతో వాయు కాలుష్యం పడిపోవడంతో ఉష్ణోగ్రతలో కూడా తగ్గుద ల కనిపించింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం.. గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) ప్రకారం ఢిల్లీలో శుక్రవారం ఏక్యూఐ 80 వద్ద ఉంది. కాగా అదే గాలినాణ్యత బుధవారం 235 ఏక్యూఐగా ఉంది. ఢిల్లీలో ఆకాశం పూర్తిగా బ్లూ కలర్‌లో దర్శనం ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చలికాలం ఆరంభంలో వాయుకాలుష్యం తగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.