calender_icon.png 6 February, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటెత్తిన ఢిల్లీ..

06-02-2025 01:25:53 AM

* ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

* ఓటింగ్ రోజు కూడా ఆప్, బీజేపీ మధ్య మాటల తూటాలు

* బీజేపీదే అధికార పీఠం!

* మార్పు కోరుకున్న ఢిల్లీ ప్రజలు! 

* 8న ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమరం ముగిసింది. నువ్వా  అన్నట్లు సాగిన పోరుకు తెరపడింది. మూడు పార్టీలు తలపడినా కానీ పోరు మా త్రం రెండు పార్టీల మధ్యే కొనసాగింది. మొ త్తం 70 స్థానాల్లో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎవరు విజేతలుగా నిలుస్తారో.. ఎంత మంది మాజీల వుతారో 8న తేలనుంది.

వరుసగా 10 సంవత్సరాల పా టు ఢిల్లీని పాలిస్తూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కి మరోసారి ఢిల్లీ పీఠం దక్కుతుందో లేదో త్వరలో తెలియనుంది. 2020 ఎన్నికలు ఏకపక్షంగా సాగగా.. ఈ దఫా మాత్రం ద్విముఖ పోరు స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా కానీ పెద్దగా ప్రభావం చూపెట్టలేదని ప్రచార సరళిని చూస్తే ఇట్టే అర్థం అయిపోయింది. అధికారంలో ఉన్న ఆప్‌తో పాటు బీజేపీ కూడా గెలుపుపై ధీమాగా ఉ న్నాయి. మరి ప్రజలు ఎవరి పాలనను కోరుకుంటున్నారో త్వరలో తేలనుంది. 

క్యూకట్టిన ప్రముఖులు, ఢిల్లీ వాసులు

ఉదయం పోలింగ్ ప్రారంభం అవడంతోనే ఓటేసేందుకు ఢిల్లీ వాసులు తరలివచ్చారు. వారితో పాటు ప్రముఖులు కూడా ఓటేశారు. 2020లో 62.46 శాతం నమోదుకాగా.. ఈ సారి సాయంత్రం వరకు ౫౮.౨౨శాతంగా నమోదయింది.  

పోలింగ్ రోజు కూడా.. 

అధికారంలో ఉన్న ఆప్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల ప్రచారంలో ఇది సుస్పష్టంగా కనిపించింది. పోలింగ్ రోజు కూడా ఈ రెండు పార్టీల నేతలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. డబ్బులు పంచుతున్నారని, ఓటర్లను ఓట్ వేయకుండా చేస్తున్నారని ఆరోపణలు గుప్పించుకున్నాయి.  

మేం నమ్మం.. 

ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆప్ తోసిపుచ్చింది. ఆ పార్టీ జాతీ య అధికార ప్రతినిధి రీనా  గుప్తా మాట్లాడుతూ.. ‘2013, 2015, 2020ల్లో కూడా మమ్మల్ని ఇలాగే తక్కువ అంచనా వేశారు. కానీ అం చనాలను మా పార్టీ తలకిందులు చేసింది. ఇప్పుడు కూడా అదే చేస్తాం’ అని తెలిపారు.  

ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర ఎగ్జిట్ పోల్ ఫలితాలపై స్పందించారు. ‘ఢిల్లీ ప్రజలు తమకు అవినీతి, అరాచకాలు వద్దని అభివృద్ధిని కోరుకున్నారు’ అని తెలిపారు. 

కాంగ్రెస్ హ్యాట్రిక్

బుధవారం విడుదలైన ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయంలో హ్యాట్రిక్ సాధించేలా కనబడుతోంది. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. ఈ సారి కూడా ఆ పార్టీ ఖాతా తెరిచే అవకాశం తక్కువే అని మెజారిటీ సర్వే సంస్థలు అభిప్రాయపడ్డాయి.  

2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఓసారి పరిశీలిస్తే ఆనాడు.. ఇండియా టుడే మై ఇండియా, టైమ్స్ నౌ, సీ ఓటర్, రిపబ్లిక్ టీవీ కీ బాత్ వంటి అనేక సంస్థలు ఆమ్ ఆద్మీదే అధికారం అని తేల్చి చెప్పారు. చెప్పినట్లే ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు వచ్చాయి.