పీకేఎల్ 11వ సీజన్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జైపూర్ పింక్ పాంథర్స్‌కు దబంగ్ ఢిల్లీ షాకిచ్చింది. శనివారం పుణే వేదికగా జరిగిన రెండో మ్యా చ్‌లో ఢిల్లీ 33 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ పై విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ ఆశు మాలిక్ (12 పాయింట్లు) సూపర్ టెన్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. పట్నా పైరేట్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 40 40తో డ్రాగా ముగిసింది. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్ 10 పాయిం ట్లు మెరవగా.. గుజరాత్ తరఫున రెయిడర్లు రాకేశ్ (9), గుమన్ సింగ్ (8) పాయింట్లతో సాధించారు. నేటి మ్యాచ్‌ల్లో బెంగళూరుతో తమిళ్ తలైవాస్, యు ముంబాతో హర్యా నా తలపడనున్నాయి.