25-03-2025 12:22:00 AM
విశాఖపట్నం, మార్చి 24: ఐపీఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఢిల్లీ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72) మెరుపు అర్థసెంచరీలు సాధించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఆఖరి వరకు కూడా ఓటమి అంచునే నిలిచింది.
అయితే విప్రజ్ నిగమ్ (39)తో కలిసి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఈ ఇద్దరు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. విప్రజ్ ఔటైనప్పటికీ అశుతోష్ ఏ మాత్రం బెదరకుండా ఆడి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ , బిష్ణోయి, దిగ్వేశ్ తలా రెండు వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.