calender_icon.png 9 February, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో న్యూ ఢిల్లీ ఫలితాలు

09-02-2025 01:42:51 AM

  • రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత లుకలుకలు
  • ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణ పై ప్రభావం చూపిస్తాయని తాము విశ్వసిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంద ని ఆశాభావం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల తర్వా త ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

మద్యం కేసులో జైలుపాలైన కేజ్రీవా ల్ పదేళ్లు ప్రజలను ఉచితాలతో భ్రమింపజేశారన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యా లయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నూ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమై న తీర్పు ను ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఉద్యోగులు, నిరుద్యోగులు, అధ్యాపకులు, పెన్షనర్లు, రైతులు, దళితులు, బీసీ లు అన్ని వర్గాల ప్రజలు సర్కారు తీరుతో సతమతమవుతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు మధ్యలోనే చదవు మానేయాల్సిన పరిస్థితి నెల కొందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజ ల తీర్పును ప్రతిబింబించేలా ఫలితాలు ఉం డబోతున్నాయని లక్ష్మణ్ ఆశాభా వం వక్తం చేశారు. మధ్యతరగతి ప్రజల కోసం మోదీ సర్కారు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నును మినహాయించినట్లు చెప్పారు.