calender_icon.png 8 February, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఫలితాలే రాష్టంలో రిపీట్..

08-02-2025 07:52:47 PM

బీజేపీ శ్రేణుల సంబరాలు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతుందని బీజేపి అదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు వేదవ్యాస్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి భారీ విజయం సాధించడం పట్ల ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే నివాసం ఎదుట ఆ పార్టీ శ్రేణులు శనివారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ మేరకు వేదవ్యాస్ మాట్లాడుతూ... ఆమ్ ఆద్మీ పార్టీ పాలనను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారన్నారు. రానున్న కాలంలో బీజేపి మరిన్ని విజయాలు సాధిస్తుందన్నారు. అవినీతికి పాల్పడితే ఏ ప్రభుత్వానికైన ఇలాంటి గతే పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గందె కృష్ణ కుమార్, విజయ్ కుమార్, మురళీధర్, కృష్ణ యాదవ్, కరుణాకర్ రెడ్డి, సుభాష్, రవి, అర్జున్, రాము సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.