calender_icon.png 4 November, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ కాలుష్యంతో ఆరోగ్యానికి ముప్పు

03-11-2024 02:34:59 AM

69శాతం కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు

తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 2: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా చేపట్టిన సర్వేలో షాకింగ్ వెల్లడయ్యాయి. ప్రజలు టపాకాయలు కాల్చడంతో కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించింది.  అత్యంత గరిష్టంగా ఏక్యూఐ 999గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కు వమంది గొంతునొప్పి, దగ్గుతో ఇబ్బంది పడ్డారు. మరో 62శాతం కుటుంబాల్లో కళ్ల మంటలతో బాధ పడ్డారు. 31శాతం మంది శ్వాస సంబంధ, మరో 31శాతం మంది తీవ్రమైన తలనొప్పి సమస్యలతో బాధపడగా 23 శాతం మంది ఆందోళనకు గురైనట్టు సర్వేలో వెల్లడించారు. ఈ సర్వేలో దాదాపు 21వేల మంది ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఎటువంటి ఢిల్లీలో కాలు ష్యం మరింత క్షీణించే అవకాశం ఉన్నందున ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారని 10,630 మందిని సర్వే సంస్థలు ప్రశ్నించాయి. పరిస్థితులు చక్కబడే వరకు నగరాన్ని వీడాలనుకుంటున్నట్టు 15శాతం మంది ప్రజలు చెప్పారు.