- త్వరలో యూనిఫాంలో మార్పులు
- కార్గో ప్యాంట్, టీషర్టులో స్టులిష్ లుక్
- సీఐ నుంచి కానిస్టేబుల్ దాకా ఒకే డ్రెస్ కోడ్
న్యూ ఢిల్లీ: పోలీసులంటే ప్రతీఒక్కరికి గుర్తు వచ్చేది ఖాకీ ప్యాంటు, ఖాకీ చొక్కా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇక నుంచి పోలీసులు కార్గో ప్యాంటు, టీ షర్టుల్లో స్టులిష్ లుక్‌లో కనిపించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ మేరకు పోలీసుల యూనిఫాం మారుతుందంటూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖాకీల యూనిఫాంలో మార్పులు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరికీ కార్గో ప్యాంట్లు, టీ షర్టులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
చలికాలంలో ఉలెన్ షర్టులు, ప్యాంట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే రంగులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని.. కొత్త యూనిఫామ్ కూడా ఖాకీ రంగులోనే ఉంటుందని సమచారం. కార్గో ప్యాంట్లకు ఎక్కువ జేబులు ఉండేలా డిజైన్ చేయిస్తున్నామని.. అందువల్ల పోలీసు సిబ్బంది వాకీ టాకీలు, ఆయుధాలు, గన్లు వంటివి సౌకర్యవంతంగా తీసుకెళ్లవచ్చని ఓ అధికారి తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.