calender_icon.png 21 November, 2024 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా ఢిల్లీ

21-11-2024 01:38:49 AM

శాంతిభద్రత పరిరక్షణలో అమిత్ షా విఫలం

మీడియా సమావేశంలో సీఎం ఆతిశీ 

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఢిల్లీ గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్థులు, దోపిడీదారులు, గూండాలకు భయం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలు తీస్తున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతిభద్రతలను అమిత్ షా తన చేతుల్లోకి తీసుకున్నప్పటికీ నేరాలను కట్టడి చేయడానికి ఏం చేయలేకపోతున్నారని విమర్శించారు.

ఇటీవల సుందర్ నగరీలో ఇద్దరు యువకులు ఓ మహిళను వేధిస్తుండగా ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకులను అడ్డుకుని మందలించారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకులు కత్తులతో వారిపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే 28ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబాన్ని ఆమె బుధవారం కలిసి పరామర్శించారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందజేశారు.