calender_icon.png 18 January, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ పీఠం మాదే!

18-01-2025 01:41:59 AM

ఆప్, కాంగ్రెస్‌లకు అవకాశమే లేదు: బీజేపీ ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌లకు భంగపాటు తప్పదని, బీజేపీకి అధికారం ఖాయమని మహబూబ్‌న గర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా తమ గెలుపును అడ్డుకోలేరని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కేసీఆర్‌పైన ఉన్న వ్యతిరేకత వల్లే రేవంత్ రెడ్డి దారితప్పి సీఎం కుర్చీ ఎక్కారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రె స్ సర్కారు చేసిందేమీ లేకపోయినా ఏదో చేసినట్లుగా అబద్ధాలతో ఢిల్లీ వీధుల్లో ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో పథకాల అమలుపై మహారాష్ర్ట, హర్యానాలో చెప్పిన అబద్ధ్దాలనే ఢిల్లీలో చెబుతున్నారని ఆమె అన్నా రు.

ఢిల్లీ ప్రజలు రేవంత్ అబద్ధాలను నమ్మడం లేదని.. కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితే లేదన్నారు. తెలంగాణలో తమ పాలనను చూసి ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆ ర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని ఇంకా ఎం తకాలం పాత పాట పాడడతారని అన్నారు.

ఢిల్లీలో ఆప్ పూర్తిగా వైఫ ల్యం చెందిందని.. మరోసారి కాంగ్రెస్‌కు గుణపాఠం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ఆమె నిలదీశారు. పూ ర్తి స్థాయిలో రుణమాఫీ చేశారా.. రై తు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు 2500 భృతి ఇచ్చారా.. మరి ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.

కేటీఆర్.. ఈడీ విచారణపై తొందరెందుకు.. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని అరుణ అన్నారు. ఈడీ విచారణలో కేటీఆర్‌ను ఏ ప్రశ్నలు అడిగారనేది ఆయన బయట చెప్పకూడదని.. కానీ ఆయన మాత్రం బయట మాట్లాడుతున్నారని తెలిపారు.

లోపల ఈడీ అడిగింది.. కేటీ ఆర్ బయట చెప్పేది ఒక్కటేనా అనేది తెలియదన్నారు. ఈడీ విచారణలో అన్ని విష యాలు బయటకు వస్తాయని తొందరెందుకని అన్నా రు. ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.