పీవీఆర్ మల్టిప్లెక్స్ సమీపంలో పేలిన బాంబు
న్యూఢిల్లీ, నవంబర్ 28: బాంబు పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. నెల రోజుల క్రితం సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద జరిగిన ఘటనను మరువకముందే రోహిణి ప్రాం తంలోని ప్రశాంత్ విహార్‌లో గల పీవీఆర్ మల్టిప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం బాంబు పేలింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. బాంబు పేలిన ప్రాంతంలో తెలుపు రంగు పొడిని గుర్తించినట్టు చెప్పారు. తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.