calender_icon.png 29 March, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిషికి ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ

26-03-2025 07:39:05 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశ రాజధానిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిషి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆమెకు నోటీసు జారీ చేసింది. జస్టిస్ జ్యోతి సింగ్ భారత ఎన్నికల కమిషన్, ఢిల్లీ పోలీసులు, ఎన్నికల్లో గెలిచిన అతిషితో పాటు కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 30కి కోర్టు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా, భారత ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది, రిటర్నింగ్ అధికారి పిటిషన్‌లో తమను పార్టీలుగా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

అవినీతి కార్యకలాపాల ఆరోపణలపై ఆప్ నాయకురాలు అతిషి ఎన్నిక విజయాన్ని సవాలు చేస్తూ ఆమె ఎన్నికల ఏజెంట్లు సమయంలో అవినీతి పద్ధతులను ఉపయోగించారని  పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది టి సింగ్‌దేవ్ ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరారు. అతిషి కల్కాజీ స్థానం నుండి బీజేపీ ప్రత్యర్థి రమేష్ బిధురిపై 3,521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పిటిషనర్లు కల్కాజీ ప్రాంత నివాసితులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ నిర్వహించగా, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటించబడ్డిన విషయం తెలిసిందే.