30-04-2024 12:15:00 AM
ఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయ కుండా నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. హిందువులు, సిక్కు దేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారని, అందుకు గాను మోదీ అనర్హులుగా ప్రకటించాలని న్యాయవాది ఆనంద్ జోంధాలే పిల్ వేశారు. దీనిపై విచారించిన జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు పిటిషనర్ భావించినప్పటికీ, ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆదేశించే అధికారం తమకు లేదని తెలిపింది. జోంధా లే పిటిషన్‌ను పరిశీలించి చట్టప్రకారం విచారిస్తామని ఈసీ తరఫు న్యాయవాది పేర్కొ న్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మోదీ చేసిన ప్రసంగంలో తాను రామమందిరాన్ని నిర్మించానని, కర్తార్‌పుర్ సాహిబ్ కారిడార్‌ను అభివృద్ధి చేశానని, ఆఫ్గానిస్థాన్ నుంచి గురుగ్రంథ సాహిబ్ కాపీలను వెనక్కి తీసుకువచ్చానని మోదీ చెప్పినట్లు ఈసీకి జోంధాలే ఫిర్యాదు చేశారు. ప్రధాని ప్రసంగాలు కులమతాల వారీగా ఓటర్ల మధ్య ద్వేషాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 153ఏ ప్రకారం మోదీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని కోరారు.