05-02-2025 08:44:52 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫిలితాలు వచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 36గా నిర్ణయించబడింది. ఆప్ 32 నుంచి 37 స్థానాల్లో గెలుస్తుందని, బీజేపీకి 35-40 సీట్లు వస్తాయని మాట్రిజ్ సంస్థ తెలిపింది. వీ ప్రిసైడ్ అనే సంస్థ ఆప్ కు 46 నుంచి 52 స్థానాలు, బీజేపీకి 18 నుంచి 23 సీట్లు వస్తాయని వెల్లడించింది. 25 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
ఈ ఎన్నికల సీజన్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఎదురుదెబ్బను చవిచూస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే రాజధానిలో కాషాయ శిబిరం తిరిగి విజయం సాధించవచ్చని చాలా మంది పోల్‌స్టర్లు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభావం మాత్రం పద్దగా కనిపించలేదు. ఢిల్లిలో 1998 నుంచి 2013 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడి ఖాతా తెరవకపోవచ్చని తెలుస్తోంది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలో కూడా కాంగ్రెస్ గెలువలేకపోయింది. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఈసారి కాంగ్రెస్ పార్టి ఖాతా తెరవకపోవచ్చని అంచనా వేశాయి.
సర్వే సంస్థ బీజేపీ ఆప్ కాంగ్రెస్
1. మాట్రిజ్ 35-40 32-37 0-1
2. పీపుల్స్ ఇన్ సైట్ 40-44 25-29 0-1
3. టైమ్స్ నౌ 39-45 22-31 0-2
4. పీమార్క్ 39-49 21-31 0-1
5. పీపుల్స్ పల్స 51-60 10-19 0-0
6. చాణక్య స్ట్రాటజీస్ 39-45 25-28 2-3
7. పోల్ డైరీ 42-50 18-25 0-2
8. డీవీ రీసెర్చ్ 36-44 26-34 0-0
9. వీ ప్రిసైడ్ 18-23 46-52 0-1
10. జేబీసీ 39-45 22-31 0-2